దిగివచ్చిన బంగారం.. భారీగా తగ్గిన వెండి ధరలు
- 24 క్యారెట్ల బంగారంపై రూ. 1960 వరకు పతనం
- కిలో వెండిపై ఒకేసారి రూ. 5000 తగ్గుదల నమోదు
- అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా ధరలు తగ్గడంపై నిపుణుల ఆశ్చర్యం
కొంతకాలంగా నిలకడగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయంగా పలు అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ కీలకమైన లోహాల ధరలు తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రోజు బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
ఇవాళ ఉదయం 10:30 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1960 తగ్గి రూ. 1,61,680కి చేరుకుంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 తగ్గి రూ. 1,48,200 వద్ద నిలిచింది. దీంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరట లభించినట్లయింది.
వెండి ధరలోనూ భారీ తగ్గుదల
మరోవైపు వెండి ధరలోనూ భారీ తగ్గుదల నమోదైంది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా రూ. 5 వేలు తగ్గింది. ఈ తగ్గుదల తర్వాత హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2.90 లక్షలకు చేరగా, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 2.80 లక్షలుగా ఉంది. స్థిరంగా సాగుతున్న ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గడంతో మార్కెట్లో ఆసక్తి నెలకొంది.