Chandrababu Naidu: చంద్రబాబు సమక్షంలో సెర్ప్, మెప్మా 36 కీలక ఒప్పందాలు

Chandrababu Naidu Oversees 36 Key Agreements with SERP and MEPMA
  • వేర్వేరు సంస్థలతో మెప్మా, సెర్ప్ ఒప్పందాలు
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం
  • చంద్రబాబు సమక్షంలో 36 కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వేర్వేరు సంస్థలతో పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీకి 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం కుదిరింది.

రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా వివిధ సంస్థలతో సెర్ప్, మెప్మా ఒప్పందాలు చేసుకున్నాయి. చంద్రబాబునాయుడు సమక్షంలో 36 కీలక ఒప్పందాలు చేసుకున్నాయి.

కుదిరిన ఒప్పందాలు ఇవీ

- పట్టణ ప్రాంతాల్లో 260 ఎగ్ కార్ట్స్ సహా మహిళలతో మైక్రో ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు కోసం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో ఒప్పందం చేసుకున్న మెప్మా.
- ఎస్‌హెచ్‌జీ సంఘాల మహిళలు తీసుకునే రుణాలపై డేటా డ్రివెన్ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్స్ తయారీ కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఒప్పందం.
- మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్, ఆధునిక రీటైల్ కియోస్క్‌ల ఏర్పాటు కోసం రీకనెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
- మహిళా మైక్రో ఎంటర్ ప్రైజెస్‌లకు ఆహారపదార్ధాల కోసం యంత్రపరికరాలను అందించేందుకు కూలెక్స్ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం.
- స్వయం ఏపీ ఎంటర్ ప్రైజ్ ఏర్పాటు, మార్కెటింగ్ లింకేజ్ కోసం నిర్మాణ్ ఆర్గనైజేషన్‌తో కుదిరిన ఒప్పందం.
- అరకు కాఫీ, చాయ్ రాస్తా లాంటి అవుట్ లెట్స్ ఏర్పాటు కోసం ఎస్‌హెచ్ జీ మహిళలకు ఆర్ధిక సహకారం కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం.
- ఎస్‌హెచ్ జీ మహిళల కుటుంబాల ఇళ్లనిర్మాణానికి ఆర్ధిక సహకారం అందించేలా ఈజీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
- తిరుపతి క్యాంటీన్ల నిర్వహణ కోసం స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్ధిక సహాకారం అందించేలా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతో ఒప్పందం.
- మిల్లెట్లతో తయారైన పదార్ధాల రీటైల్ అవుట్ లెట్‌ల ఏర్పాటు కోసం 9 నట్జ్ మిల్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
- మహిళా సంఘాలు ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసుకునేలా డిజిటల్ డీపీఆర్‌లు సిద్ధం చేసుకునేలా సహకారం కోసం ఫిన్ వోయిస్ ఓపెన్ బిజినెస్ సొల్యూషన్స్‌తో ఒప్పందం.
- సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగించే సముద్రపు నాచు సాగులో స్వయం సహాయ సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం.
- సీవీడ్ కల్చర్‌లో మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల తయారీ కోసం సీఎస్ఐఆర్‌తోనూ కీలకమైన ఒప్పందం చేసుకున్న సెర్ప్. 
- ఎస్‌హెచ్‌జీ మహిళలకు సీవీడ్ ఉత్పత్తులు, విలువ జోడింపు, శిక్షణ కోసం కేరళకు చెందిన అమృత విశ్వ విద్యాపీఠంతో ఒప్పందం చేసుకున్న సెర్ప్.
- వెలుగు 2.0 ద్వారా ఎస్‌హెచ్‌జీ పారిశ్రామిక వేత్తలను బలోపేతం చేసేలా శిక్షణ, ప్రొఫైలింగ్, మార్కెట్ స్కేల్ అప్ కోసం ఎక్స్‌ఎల్‌ఆర్ఐ సంస్థతో ఒప్పందం.
- పొదుపు చేసిన మొత్తాలను వ్యాపారాలుగా మార్చేందుకు అవసరమైన సహకారం కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో సెర్ప్ ఒప్పందం.
- సర్క్యులర్ ఎకానమీ మోడల్ ద్వారా చేనేత వస్త్రాల జాబ్ వర్క్‌ను విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ అంశాల్లో ఆప్కో మాజిక్ వీవ్స్‌తో ఒప్పందం.
- మహిళా ఎఫ్‌పీఓల బలోపేతం, మార్కెట్ లింకేజి, సహా వివిధ అంశాలపై సహకారం కోసం ఐఐఎం విశాఖపట్నంతో ఒప్పందం చేసుకున్న సెర్ప్.
- దేశీయ పౌల్ట్రీ ఉత్పత్తులు, ప్రకృతి సేద్యం ల్యాండ్ స్కేప్ లాంటి అంశాల్లో  సహకారం కోసం వాసన్‌తో ఒప్పందం. 
- లైవ్ స్టాక్ వ్యాల్యూ చైన్స్, ఎఫ్‌పీఓలకు సాంకేతిక మద్ధతు అందించేందుకు హైఫెర్ ఇంటర్నేషనల్‌తో కుదిరిన ఒప్పందం.
- ఎఫ్‌పీఓ సర్టిఫికేషన్, గిరిజన ప్రాంతాల్లో మహిళలకు జీవనోపాధి కల్పించే అంశాలకు మద్దతు ఇచ్చేలా విజయవాహిని ఛారిటబుల్ ఫౌండేషన్‌తో ఒప్పందం.
- మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సహా , క్రెడిట్ రెడీనెస్ కోసం కాల్గుడి డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం.
- మహిళా ఎఫ్‌పీఓలకు ప్రోత్సాహం, ఉత్తరాంధ్రలోని గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం బాపూజీ రూరల్ ఎన్ లైట్మెంట్ డెవలప్మెంట్ సొసైటీతో ఒప్పందం.
- మహిళా రైతులు, ఎఫ్‌పీఓలుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సలహాలను ఇచ్చేందుకు డిజిటల్ గ్రీన్ ట్రస్ట్‌తో ఒప్పందం చేసుకున్న సెర్ప్.
- స్వయం సహాయ మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ ఆడిట్స్, కెపాసిటీ బిల్డింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాల్లో హకారం కోసం ఫుడ్ సేఫ్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం.
- ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో నడిచే చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సహకారం హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ కోసం ఇండియన్ ఎంపోరియంతో ఒప్పందం.
- మహిళా సంఘాల సంస్థలు ఉత్పత్తి చేసిన హ్యాండ్లూమ్ వస్త్రాల ఎగుమతి, మార్కెటింగ్ లింకేజ్ కోసం ఎంబ్యోమ్ కన్సల్టింగ్ సర్వీసెస్‌తో ఒప్పందం.
- మిల్లెట్ క్లస్టర్ల అభివృద్ధి, బ్రాండింగ్ లాంటి అంశాల్లో యాక్సెస్ లైవ్లీ హుడ్స్ కన్సల్టింగ్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న సెర్ప్.
- ఎస్‌హెచ్‌జీ సంస్థలు ఉత్పత్తి చేసిన సుగంధ ద్రవ్యాలు, పచ్చళ్ల తయారీ ఇతర ప్రాసెసింగ్ కోసం నిఎంఎస్ఎంఈతో ఒప్పందం.
- స్వయం సహాయ మహిళా సంఘాలకు గ్రామీణ సంస్థల ఏర్పాటు , స్కిల్ డెవలప్మెంట్ లాంటి అంశాల కోసం సెంచూరియన్ యూనివర్సిటి ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ తో ఒప్పందం చేసుకున్న మెప్మా.
- 800కు పైగా ఎస్‌హెచ్‌జీలు చాయ్ రస్తా, కాఫీ అవుట్ లెట్‌లను ఏర్పాటు చేసి నిర్వహించేందుకు వీలుగా చాయ్ రాస్తా ఆస్పిరేషనల్ ఫుడ్స్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్న మెప్మా.
- 20 వేల తిరుపతి క్యాంటీన్ అవుట్ లెట్స్‌ను స్వయం సహాయ సంఘాల మహిళలు ఏర్పాటు చేసేలా సారా ప్రాజెక్ట్స్- తిరుపతి క్యాంటీన్స్ సంస్థతో ఒప్పందం.
- కమ్యూటీ హెల్త్ ప్రొఫైలింగ్, ఎస్ హెచ్ జీ మహిళల కుటుంబాలకు హెల్త్ స్క్రీనింగ్ కోసం స్వస్తి ది హెల్త్ కేటలిస్ట్ సంస్థతో ఒప్పందం.
- మొబైల్ డెసెర్ట్ తయారీ ఈవీ వాహనాల నిర్వహణ కోసం ద థిక్ షేక్ ఫ్యాక్టరీ లిమిటెడ్‌తో ఒప్పందం.
- గ్రామీణ మహిళా పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను స్వయం డిజిటల్ స్టోర్ ఫ్రంట్ ద్వారా మార్కెటింగ్ చేసుకునేందుకు సహకారం అందించేలా ఫ్లిప్ కార్ట్‌తో ఒప్పందం.
- ఎస్‌హెచ్ జీ క్లస్టర్ డెవలప్మెంట్, శిక్షణ, పరిశ్రమలకు ప్రోత్సాహం తదితర అంశాల్లో సాయం అందించేలా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తో ఒప్పందం.
- వస్త్రాల తయారీ, శిక్షణ, అరకు కాఫీ ఆన్ వీల్స్ లాంటి వాటిలో సహకారం కోసం ఏపి ఐటీసీఓ సంస్థతో ఒప్పందం.
- స్వయం సహాయ సంఘాల్లోని మహిళల ఆర్ధిక స్వావలంబన, శిక్షణ, సహకారం కోసం మొత్తం 36 సంస్థలతో మెప్మా, సెర్ప్ ఒప్పందాలు.
- ఆర్ధిక, వ్యవసాయ, సీవీడ్, హ్యాండ్లూమ్, ఫుడ్ సర్వీస్, హెల్త్, డిజిటల్, ఎంఎస్ఎంఈ, నైపుణ్య కల్పన తదితర రంగాల్లో కుదిరిన ఒప్పందాలు.
- వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగంగా మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేసేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం.
Chandrababu Naidu
SERP
MEPMA
Andhra Pradesh
Self Help Groups
Women Empowerment

More Telugu News