'కొక్కరకో' అంటూ బాడీగార్డ్ పోస్ట్.. విజయ్-త్రిషల బంధంపై క్లారిటీ ఇచ్చినట్టేనా?
- విజయ్, త్రిషల ప్రేమ వ్యవహారంపై మళ్లీ ఊహాగానాలు
- వారి బంధాన్ని బాడీగార్డ్ పరోక్షంగా ధ్రువీకరించారనే చర్చ
- చెంగల్పట్టు కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసిన భార్య సంగీత
- విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని పిటిషన్‌లో ఆరోపణ
ఈ పరిణామాల మధ్య విజయ్ వ్యక్తిగత బాడీగార్డ్ అరుణ్ సురేష్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘అన్ని రూమర్లకు అతీతంగా ఎదిగే సమయం ఆసన్నమైంది’ అంటూ ఫైర్ ఎమోజీతో ఒక స్టోరీ పెట్టారు. అంతేకాకుండా, విజయ్ ఫోటోను షేర్ చేస్తూ, బ్యాక్‌గ్రౌండ్‌లో విజయ్-త్రిషల హిట్ సినిమా ‘గిల్లి’లోని ‘కొక్కరకో’ పాటను జతచేశారు. దీంతో వారి బంధాన్ని ఆయన పరోక్షంగా ధ్రువీకరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, విజయ్ భార్య సంగీత సోర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు. 1999లో వివాహం చేసుకున్న ఈ జంట 25 ఏళ్ల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీతో బరిలోకి దిగాలని భావిస్తున్న విజయ్‌కు ఈ వివాదం రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు విజయ్ గానీ, త్రిష గానీ స్పందించలేదు. ఏప్రిల్ 20న ఈ కేసు కోర్టులో విచారణకు రానుండటంతో ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.