హైదరాబాద్ వాతావరణ కేంద్రం కార్యాలయానికి బాంబు బెదిరింపు

IMD Hyderabad Office Receives Bomb Threat
  • 14 బాంబులు పెట్టామని, మధ్యాహ్నం పేలుతాయని బెదిరింపు మెయిల్
  • పోలీసులకు సమాచారం అందించిన సిబ్బంది
  • తనిఖీ చేసి ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించిన బాంబు స్క్వాడ్
హైదరాబాద్ బేగంపేటలోని వాతావరణ కేంద్రం కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. కార్యాలయంలో 14 బాంబులు పెట్టామని, అవి మధ్యాహ్నం పేలుతాయంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించారు. తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్ ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించింది.

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. శంషాబాద్ విమానాశ్రయం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈరోజు ఉదయం వాతావరణ శాఖకు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ ఫేక్ అని తేల్చింది.
Go Back to Shorts
IMD Hyderabad
Hyderabad
Begumpet
IMD
Bomb threat
Weather office
Shamshabad Airport

More Telugu News