Janhvi Kapoor: జాన్వీ కపూర్ పుట్టినరోజున స్పెషల్ వీడియో వదిలిన 'పెద్ది' టీమ్

Janhvi Kapoor Birthday Special Video Release from Peddi Movie Team
  • రామ్ చరణ్ 'పెద్ది' టీమ్ నుంచి జాన్వీ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
  • 'అచ్చియమ్మ' పాత్రలో నటిస్తున్న జాన్వీ
  • దర్శకుడు బుచ్చిబాబు ప్రశంసలతో స్పెషల్ వీడియో విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇవాళ‌ తన 29వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది.

ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన శైలిలో జాన్వీ అందాన్ని వర్ణించిన తీరు ఆకట్టుకుంటోంది. "కాటుక అక్కర్లేని ఆ కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ఆ ముక్కు.. అంటే అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరియే ఈ చికిరి" అంటూ ఆయన చెప్పిన మాటలతో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ సరసన జాన్వీ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Janhvi Kapoor
Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Achiyamma
Tollywood
RRR
AR Rahman
Mythri Movie Makers
Telugu cinema

More Telugu News