మంటల్లో చిక్కుకున్న ఇరాన్ డ్రోన్ వాహక నౌక: ట్వీట్ చేసిన యూఎస్ సెంట్రల్ కమాండ్

  • ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో భాగంగా ఇరాన్ నేవీ లక్ష్యంగా అమెరికా దాడులు
  • వాహక నౌక మంటల్లో చిక్కుకున్న వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్న అమెరికా
  • ఇరాన్ నావికాదళాన్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని వెల్లడి
ఇరాన్ డ్రోన్ వాహక నౌకపై అమెరికా సెంట్రల్ కమాండ్ దాడి చేసింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో భాగంగా ఇరాన్ నేవీ లక్ష్యంగా అమెరికా దాడులను తీవ్రం చేసింది. అమెరికా దాడిలో ఇరాన్ డ్రోన్ వాహక నౌక‌ మంటల్లో చిక్కుకుపోయింది. ఈ వాహక నౌక మంటల్లో చిక్కుకున్న వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ తన 'ఎక్స్' వేదికగా పంచుకుంది.

మొత్తం ఇరాన్ నావికాదళాన్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో అమెరికా దళాలు ముందుకు వెళుతున్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆ ట్వీట్‌లో పేర్కొంది. అమెరికా దళాలు ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని తెలిపింది. ఈరోజు రెండవ ప్రపంచ యుద్ధ విమాన వాహక నౌక పరిమాణంలో ఉన్న ఇరానియన్ డ్రోన్ క్యారియర్‌పై దాడి చేయగా అది మంటల్లో చిక్కుకుందని వెల్లడించింది.

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ఏడవ రోజుకు చేరుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మొదటి రోజునే మృతి చెందారు. అయినప్పటికీ ఇరాన్ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో దీటుగా పోరాడుతోంది. దీంతో అమెరికా ఇరాన్‌పై యుద్ధాన్ని తీవ్రం చేసింది. అత్యంత శక్తిమంతమైన బాంబర్లను వినియోగిస్తోంది. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌లోని టెల్అవివ్‌పై దాడులు పెంచింది.


More Telugu News