Vrushakarma Glimpse: ఒళ్లు గగుర్పొడిచేలా నాగచైతన్య ‘వృషకర్మ’.. ఇది నిధి వేట కాదు.. అంతకుమించి!

Naga Chaitanya Vrushakarma Glimpse Released
  • ఇది కేవలం నిధి వేట కాదు.. మైథలాజికల్ థ్రిల్లర్ అని స్పష్టీక‌ర‌ణ‌
  • విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో భారీ చిత్రం
  • సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ సంయుక్త నిర్మాణం
  • కీలక పాత్రల్లో జయరాం, మీనాక్షి చౌదరి
యువసామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో, సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇది కేవలం నిధి వేట చుట్టూ తిరిగే అడ్వెంచర్ సినిమా మాత్రమే కాదని, దుష్టశక్తులతో కూడిన ఒక మైథలాజికల్ థ్రిల్లర్ అని ఈ గ్లింప్స్ స్పష్టం చేసింది.

విడుదలైన వీడియోలో ఒక దుష్టశక్తి ఆవహించిన వ్యక్తి ఒక మనిషి కన్ను పొడిచినట్టు చిత్రపటం గీస్తాడు. అది పూర్తవగానే అతని నోటి నుంచి గబ్బిలం లాంటి భయంకర జీవి బయటకు వచ్చి, ఆ చిత్రపటంలో ఉన్నట్టే ఒక వ్యక్తిని చంపేస్తుంది. "ఒక సాటిలేని శక్తి మేల్కొన్నప్పుడు... సృష్టి దాని గమ్యం తప్పినప్పుడు... విధి తన దారిని తానే ఎంచుకుంటుంది" అనే వాయిస్ ఓవర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వీడియోలో నాగచైతన్య, మీనాక్షి చౌదరి, జయరాం పాత్రలను కూడా పరిచయం చేశారు.

ఈ సినిమాపై నాగచైతన్య గతంలో చెప్పిన మాటలను ఈ గ్లింప్స్ నిజం చేస్తోంది. "ఇది భారీ వీఎఫ్ఎక్స్‌తో కూడిన మైథలాజికల్ థ్రిల్లర్. నా 15 ఏళ్ల కెరీర్‌లో ఇంత భారీ స్పాన్‌లో సినిమా చేయలేదు" అని చైతన్య గతంలో పేర్కొన్నారు. ఇప్పుడు విడుదలైన వీడియో చూస్తే ఆయన చెప్పింది నిజమేననిపిస్తుంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ), సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నీల్ డి కున్హా సినిమాటోగ్రఫీ, అజనీశ్‌ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

Vrushakarma Glimpse
Vrushakarma
Naga Chaitanya
Karthik Dandu
Mythological thriller
Meenakshi Chaudhary
Jayaram
Sukumar Writings
SVCC
Telugu movie
New movie glimpse

More Telugu News