ఐపీఎల్‌లో సీఎస్‌కేకు విజిల్ వేస్తే ఎన్నికల్లో టీవీకే విజిల్‌కు ఓటేస్తారు: నటుడు విజయ్
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తనకు భావోద్వేగమన్న నటుడు విజయ్
- మిగతా పార్టీలకు సాధారణ ఎన్నిక అని వ్యాఖ్య
- ఢిల్లీ బీజేపీతో పాటు అన్ని జట్లను టీవీకే ఓడిస్తుందన్న విజయ్
ఐపీఎల్ క్రికెట్‌లో తమిళనాడు చెన్నై సూపర్ కింగ్స్‌కు విజిల్ వేస్తే ఈ ఎన్నికల్లో టీవీకే విజిల్ గుర్తు మారుమోగుతుందని అన్నారు. ప్రజలకు తనతో ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని అన్నారు.
ఈ సందర్భంగా తాను అధికారంలోకి వస్తే ఏమేం చేస్తానో హామీలు ఇచ్చారు. రెండెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతు బిడ్డల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. అయితే ఆ కుటుంబాల్లో ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదనే నిబంధనను కూడా ఆయన స్పష్టం చేశారు. ఉన్నత విద్య కోసం భారీగా ఖర్చు చేయలేని పేద కుటుంబాలకు సహకరించాలనేది తన ఉద్దేశమని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.