ఐఏఎస్, ఐపీఎస్‌లను బెదిరిస్తున్నారు: ముఖ్యమంత్రిపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు

  • ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం రావడం లేదని విమర్శ
  • ఐపీఎస్, ఐఏఎస్‌లను పదేపదే బదిలీ చేస్తున్నారన్న హరీశ్ రావు
  • రెండున్నరేళ్లలో ైదుసార్లు భారీ ఎత్తున బదిలీ చేశారన్న హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్‌లను బెదిరిస్తున్నారంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం రావడం లేదని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను పదేపదే బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు.

రెండున్నరేళ్లలోనే ఐదుసార్లు భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ బదిలీలతో పాలన కుంటుపడుతోందని అన్నారు. పరిస్థితులను అర్థంచేసుకునే లోపే అధికారులను బదిలీ చేస్తున్నారని విమర్శించారు.

జీహెచ్ఎంసీ కమిషనర్లు కూడా రెండున్నరేళ్లలో నలుగురు మారారని తెలిపారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులకు నచ్చకపోతే ఆ అధికారులను వెంటనే బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. కొందరికి పోస్టింగులు ఇచ్చి జాయిన్ చేసుకోవడం లేదని విమర్శించారు. త్వరలో కాంగ్రెస్ నేతల అవినీతిని, బినామీలను బయటపెడతామని హెచ్చరించారు.

Harish Rao
Revanth Reddy
Telangana
IAS officers
IPS officers
Transfers
GHMC Commissioner

More Telugu News