అమెరికా వద్ద క్షిపణి నిల్వలు తగ్గిపోతున్నాయా? పెంటగాన్ నివేదిక లీక్
- దాడులు మరో 10 రోజులు కొనసాగితే కీలక క్షిపణుల నిల్వలు తగ్గిపోవచ్చని హెచ్చరిక
- ఇంటర్ సెప్టర్ క్షిపణులు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడి
- ఆయుధ సంపత్తిని తిరిగి పెంచుకునేందుకు అధిక ఖర్చులు భరించాల్సి ఉంటుందన్న నివేదిక
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. యుద్ధం కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో పెంటగాన్ నుంచి వచ్చిన హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది. అమెరికా వద్ద రోజురోజుకూ క్షిపణి నిల్వలు తగ్గిపోతున్నట్లు పెంటగాన్ నివేదిక లీక్ అయింది. మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే కీలకమైన క్షిపణుల నిల్వలు తగ్గిపోవచ్చని ఈ నివేదిక హెచ్చరించింది.
ముఖ్యంగా ఇంటర్ సెప్టర్ క్షిపణులు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కోవడంలో ప్రస్తుతం ఇవి కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఈ క్రమంలో పది రోజులు దాడులు కొనసాగితే పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఆయుధ, క్షిపణి సంపత్తిని తిరిగి పెంచుకునేందుకు అధిక ఖర్చులు భరించాల్సి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. కీలకమైన ఆయుధాల కొరత వల్ల ఇరాన్ దాడులను తిప్పికొట్టడం అసాధ్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. గత కొన్నేళ్లుగా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లకు ఆయుధ సంపత్తిని అందిస్తుండటంతో నిల్వలు తగ్గిపోతున్నట్లు తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటన మాత్రం మరోలా ఉంది. తమ వద్ద లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ తో పోరాడటానికి కావాల్సిన ఆయుధాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలను ఇతర దేశాల్లోనూ నిల్వ చేశామని వెల్లడించారు. ఇరాన్‌పై దాడులు మరో ఐదు వారాలు లేదా అంతకంటే ఎక్కువగా కొనసాగవచ్చునని తెలిపారు.