టెహ్రాన్ సమీపంలో భూగర్ఫ స్థావరంలో అణుప్రాజెక్టును ధ్వంసం చేశాం: ఇజ్రాయెల్
- రహస్య భూగర్భ అణు ప్రాజెక్టును ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడి
- ఇక్కడ శాస్త్రవేత్తలు రహస్యంగా పని చేస్తున్నట్లు సమాచారం అందిందని వెల్లడి
- పక్కా సమాచారంతో దాడి చేశామన్న ఇజ్రాయెల్ రక్షణ దళం
ఇరాన్‌లోని రహస్య భూగర్భ అణు ప్రాజెక్టును ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఎఫ్) ప్రకటించింది. రాజధాని టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజాదేహైలో రహస్యంగా ఏర్పాటు చేసిన ఈ అణు ప్రాజెక్టుపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ వెల్లడించారు. ఇక్కడ శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందని, దీనితో దాడి జరిపినట్లు ఐడీఎఫ్ తెలిపారు.
2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడకు మళ్లించిందని వెల్లడించారు. గత ఏడాది జూన్ నెలలో ఇరాన్‌పై 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు దాడికి ఉపయోగించిన మందుగుండు సామాగ్రి కంటే ఈ నాలుగు రోజుల్లో ఉపయోగించిందే ఎక్కువ అని తెలిపారు.
గతంలోనే ఇరాన్ అణుస్థావరాలపై తాము దాడులు చేశామని డెఫ్రిన్ తెలిపారు. అయినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపలేదని అన్నారు. అణ్వాయుధాలను టెహ్రాన్ శివార్లలోని రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని, దీనికి సంబంధించి తమకు కచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామని డెఫ్రిన్ వెల్లడించారు.