Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం .. రంగంలోకి శ్రీశైలం బృందం

Polavaram Tiger creates a stir in district
Advertisement
  • పోలవరం జిల్లా గంగవరం మండలంలో పెద్దపులి సంచారం
  • కుసుమరాయి పరిసరాల్లో పులి తిరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన
  • నాలుగు ప్రత్యేక బృందాలతో ఇప్పటికే నిఘా పెట్టిన అటవీ శాఖ
  • పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీశైలం నుంచి వస్తున్న మరో బృందం
  • రాత్రిపూట గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
Advertisement
పోలవరం జిల్లా, గంగవరం మండలం కుసుమరాయి గ్రామ పరిసరాల్లో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి కదలికల నేపథ్యంలో అటవీ శాఖ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే పులి జాడ కనుగొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా, పరిస్థితిని మరింత నిశితంగా సమీక్షించేందుకు శ్రీశైలం నుంచి మరో నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నట్లు అటవీ శాఖ అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. 

పులి సంచారం దృష్ట్యా గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లేవారు, ఒంటరిగా బయట తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పులి జాడను గుర్తించేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందని, ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులకు సహకరించాలని కోరారు.
 
Advertisement
Advertisement
Polavaram
Polavaram tiger
Andhra Pradesh tiger
Gangavaram
Kusumarayi village
Srisailam
Forest department Andhra Pradesh
Tiger watch
Wildlife Andhra Pradesh
Tiger tracking

More Telugu News