పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన బీజేపీ
- జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నితిన్ నబిన్
- బీహార్‌లోని బాంకీపూర్ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబిన్
- నబిన్‌తో సహా తొమ్మిది మంది పేర్లను విడుదల చేసిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను బీహార్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేట్ చేసింది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. నితిన్ నబిన్‌తో పాటు మరో ఎనిమిది మంది పేర్లను బీజేపీ ప్రకటించింది. నితిన్ నబీన్ జనవరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌కు చెందిన ఆయన అంతకుముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేశారు.
గత సంవత్సరం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. బీహార్ నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందారు. నితిన్ నబిన్‌తో పాటు రాజ్యసభకు వెళ్లనున్న వారి పేర్లను బీజేపీ విడుదల చేసింది.
బీహార్ నుంచి నితిన్ నబిన్‌తో పాటు శివేశ్ కుమార్ ఉన్నారు. అసోం నుంచి తెరాశ గోవాలా, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీవర్మ, హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సమాల్, సుజిత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా ఉన్నారు.
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. 10 రాష్ట్రాలలోని ఆరింటిలో బీజేపీ లేదా మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. దీంతో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోనుంది. రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర (7), తమిళనాడు (6), పశ్చిమ బెంగాల్ (5), బీహార్ (5), ఒడిశా (4), అస్సాం (3), తెలంగాణ (2), ఛత్తీస్‌గఢ్ (2), హర్యానా (2), హిమాచల్ ప్రదేశ్ (1) ఉన్నాయి.