శ్రీకాళహస్తి ఆలయంలో త్రిపుర సీఎం ప్రత్యేక పూజలు
- శ్రీకాళహస్తీశ్వరుని సేవలో త్రిపుర సీఎం మాణిక్ సాహా
- సతీ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న మాణిక్ సాహా
- ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
తొలుత వారికి ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వారి వేద ఆశీర్వాదం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. క్షేత్ర మహాత్యం గురించి ఆలయ అధికారులు వివరించారు.