యూఏఈపై ఇరాన్ ప్రతిదాడి... బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించిన ప్రభుత్వం

Iran retaliates against America Burj Khalifa evacuated
  • యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిలు ప్రయోగం
  • దుబాయ్‌లో భారీ శబ్ధం వినిపించిందన్న అధికారులు
  • అబుదాబి, దుబాయ్‌లలో బాంబుల మోత
దుబాయ్‌లోని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను అక్కడి ప్రభుత్వం ఖాళీ చేయించింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్ మీద దాడులకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే. దీనితో ఇరాన్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్‌పై బాలిస్టిక్ క్షిపణిలను ప్రయోగించింది. ఈ క్రమంలో బుర్జ్ ఖలీఫా నుంచి ప్రజలను ఖాళీ చేయించారు.

అమెరికా సైనిక సిబ్బందికి స్థావరంగా ఉన్న అల్ దఫ్రా వైమానిక స్థావరాన్ని ఇరాన్ దళాలు లక్ష్యంగా చేసుకోవడంతో అబుదాబి, దుబాయ్‌లలో బాంబుల మోత మోగింది.

దుబాయ్‌లో భారీ పేలుడు శబ్ధం వినిపించిందని, అయితే ఆ శబ్ధం క్షిపణి దాడి వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. దుబాయ్ బీచ్‌ల నుంచి దోహా వీధుల వరకు పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో ఇరాన్ ఒకేసారి వివిధ దేశాలలోని అమెరికా లక్ష్యాలపై దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యూఏఈ రాజధాని అబుదాబీలో సీఎన్ఎన్ విలేకరులు పేలుళ్ల శబ్దాలు విన్నారు.
Go Back to Shorts
Burj Khalifa
Iran
United Arab Emirates
America
Al Dhafra Air Base
Ballistic Missile
Dubai

More Telugu News