ఫోన్‌లో సిమ్ లేకుంటే వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు బంద్... మార్చి నుంచి కొత్త నిబంధనలు!

  • వచ్చే నెలనుంచి అమల్లోకి రానున్న సిమ్ బైండింగ్ నిబంధనలు
  • మెసేజింగ్ యాప్‌లకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చిన కేంద్రం
  • వాట్సాప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది
మార్చి 1వ తేదీ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు ఫోన్‌లలో యాక్టివ్ సిమ్ కార్డు తప్పనిసరి. ఈ యాప్స్‌కు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన అమల్లోకి వస్తే, సిమ్ లేకుండా మెసేంజర్ యాప్స్ ఫోన్‌లో పనిచేయవు. గత సంవత్సరం నవంబరులో ఈ నిబంధనలు ప్రకటించినప్పటికీ, వీటిని అమలు చేయడానికి ఆయా సంస్థలకు ప్రభుత్వం ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చింది.

గడువు రేపటితో ముగియనున్నందున, ఎల్లుండి నుంచి సిమ్ లేకుంటే ఆయా యాప్స్ ఫోన్‌లో పనిచేయకపోవచ్చు. ఎవరైనా సిమ్ లేకుంటే యాప్స్ ఉపయోగిస్తుంటే కనుక ఆ ఫోన్‌లలో ఈ యాప్ నిలిచిపోతుంది. వాట్సాప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది.

వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకువచ్చింది. దీంతో ఈ యాప్స్‌కు సిమ్ కార్డు బైండింగ్‌ను తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం (డాట్) ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోయినా లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు నిలిచిపోతాయి. వాట్సాప్ వెబ్‌ను ఉపయోగిస్తే ప్రతి 6 గంటలకు ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.


More Telugu News