హీరో విజయ్‌కి భారీ షాక్... విడాకులకు దరఖాస్తు చేసిన భార్య సంగీత
- నటుడు విజయ్‌కి విడాకుల నోటీసులు జారీ చేసిన ఫ్యామిలీ కోర్టు
- భర్తపై నమ్మకద్రోహం ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేసిన సంగీత
- ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్‌కి ఆదేశం
- మరో నటితో విజయ్‌కి సంబంధం ఉందంటూ సంగీత ఆరోపణ
- విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత తెరపైకి వచ్చిన విడాకుల వ్యవహారం
తమిళ సూపర్‌స్టార్, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ (టీవీకే) అధినేత దళపతి విజయ్‌కి వ్యక్తిగత జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 25 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని కోరుతూ ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. భర్త విజయ్ తనకు నమ్మకద్రోహం చేశారని ఆరోపిస్తూ ఆమె ఈ పిటిషన్ దాఖలు చేయడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
సంగీత దాఖలు చేసిన పిటిషన్‌ను చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టు విచారణకు స్వీకరించింది. భర్త విజయ్‌కు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని, 2021లో ఈ విషయం తాను గుర్తించినట్లు ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, ఏప్రిల్ 20వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని విజయ్‌కి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
1999 ఆగస్టులో విజయ్, సంగీత వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత జరిగిన కార్యక్రమాల్లో సంగీత కనిపించకపోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం... వివాహేతర సంబంధంపై నిలదీయగా, దానికి ముగింపు పలుకుతానని విజయ్ హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని సంగీత ఆరోపించారు.
ఇటీవల తమిళనాడు బీజేపీ నేత నయనార్ నాగేంద్రన్ సైతం.. విజయ్, నటి త్రిషతో బంధం నుంచి బయటకు వస్తేనే రాజకీయాలు అర్థమవుతాయని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఈ విడాకుల వ్యవహారంపై విజయ్ లేదా ఆయన ప్రతినిధుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.