Taliban: కూలిన పాక్ ‘వైట్ ఎలిఫెంట్’.. ఎఫ్-16 శకలాలను ప్రదర్శించిన తాలిబన్లు!
- తమ విమానం కూలలేదని ఖండించిన పాకిస్థాన్
- తమ దాడుల్లో 133 మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి చెందారని పాక్ ప్రకటన
- ఎఫ్-16 వినియోగంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. తమ భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేసిన పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు ఆధారంగా విమాన శకలాలకు సంబంధించిన వీడియోను విడుదల చేయడం సంచలనం రేపుతోంది.
శుక్రవారం తెల్లవారుజామున కాబూల్, కాందహార్ సహా పలు ఆఫ్ఘన్ నగరాలపై పాక్ వైమానిక దళం బాంబు దాడులు చేసింది. ఈ దాడులను తిప్పికొట్టే క్రమంలో పాక్‌కు చెందిన ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేశామని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ విమానం కాబూల్ సమీపంలోని పర్వత ప్రాంతంలో కుప్పకూలిందని, పైలట్ కోసం గాలిస్తున్నామని ఆయన వివరించారు.
తాలిబన్లు విడుదల చేసిన వీడియోలో యుద్ధ విమానం తోక భాగం, దానిపై పాకిస్థాన్ జెండా, సీరియల్ నంబర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను పాకిస్థాన్ రక్షణ శాఖ ఖండించింది. తమ విమానాలన్నీ సురక్షితంగా వెనక్కి వచ్చాయని, ఏ విమానమూ కూలిపోలేదని స్పష్టం చేసింది. కానీ, తాలిబన్లు ప్రదర్శిస్తున్న వీడియోపై మాత్రం పాక్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
మరోవైపు, తాము చేపట్టిన 'ఆపరేషన్ గజాబ్-లిల్-హక్'లో 133 మంది ఆఫ్ఘన్ సైనుకులు మరణించారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు మాత్రమే వాడాలన్న నిబంధనతో అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్-16 విమానాలను ఆఫ్ఘన్‌పై దాడులకు ఉపయోగించడంపై వాషింగ్టన్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఎఫ్-16 లాంటి శక్తిమంతమైన విమానాన్ని కోల్పోవడం పాకిస్థాన్‌కు సైనికపరంగా, అంతర్జాతీయంగా పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.