ఐశ్వర్య అర్జున్ కి మిగిలింది చేదు అనుభవమే!

Aishwarya Arjun Special
షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరకి వారసులుగా హీరోలు పరిచయం కావడం సాధారణమైన విషయమే. అయితే సీనియర్ హీరోల కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడమనేది ఈ మధ్యనే కాస్త ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇక్కడ తన తొలి సినిమాగా 'సీతా పయనం' చేసింది. అర్జున్ ఈ సినిమాకి నిర్మాతగా .. దర్శకుడిగా వ్యవహరించడం విశేషం. అయితే ఈ సినిమా ఫలితం నిరాశపరిచిన విషయం తెలిసిందే. 

నిజానికి అర్జున్ కూతురు కోలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టి చాలాకాలమే అయింది. అప్పట్లోనే ఆమె తెలుగులో కూడా చేసి ఉండవలసింది. అయితే ఆమె టాలీవుడ్ వైపుకు రావడంలో చాలా ఆలస్యం చేసింది. నిజానికి ఈ సినిమా కోసం అర్జున్ టాలీవుడ్ లో చాలా వరకూ చుట్టబెట్టారు. ఎంతోమందిని కలుసుకున్నారు. ప్రమోషన్స్ వైపు నుంచి ఈ సినిమాను ఆడియన్స్ కి చేరువగా తీసుకుని వెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అవేవీ ఆశించిన ప్రయోజనాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. 

ఈ సినిమా విషయంలో రెండు రకాల అభిప్రాయాలు వినిపించాయి. అర్జున్ తన కూతురు సినిమాను తాను డైరెక్ట్ చేయకుండగా ఉండవలసిందనీ, నిర్మాతగా ఆయనే ఉండటం మంచిదైందని చెప్పుకున్నారు. ఎందుకంటే ఆర్ధికపరమైన విషయాల వైపు నుంచి ఆయనకి విమర్శలు లేకుండా పోయాయి. కథలో అనవసరమైన విషయాల సంఖ్య పెరగడం, హీరోయిన్ తో పాటు హీరో కూడా కనెక్ట్ కాకపోవడం మైనస్ అయింది. మొత్తానికి ఈ సినిమా ఐశ్వర్య అర్జున్ కి చేదు అనుభవాన్నే మిగిల్చిందని చెప్పాలి.

Go Back to Shorts
Aishwarya Arjun
Seetha Payanam
Arjun Sarja
Telugu cinema
Tollywood debut
Kollywood
Movie review
Telugu film industry
Heroine
Film promotions

More Telugu News