Konkona Sen Sharma: అనూహ్యమైన మలుపులతో సాగే 'అక్యూజ్డ్'
- విభిన్నమైన కథాంశంతో సాగే 'అక్యూజ్డ్'
- ప్రధానమైన పాత్రను పోషించిన కొంకణా సేన్ శర్మ
- నెట్ ఫ్లిక్స్ నిర్మించిన కంటెంట్
- ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్
'నెట్ ఫ్లిక్స్' వారు నిర్మించిన హిందీ సినిమానే 'అక్యూజ్డ్'. నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. విభిన్నమైన కంటెంట్ తో .. బలమైన తారాగణంతో నిర్మించిన ఈ సినిమాలో, కొంకణా సేన్ శర్మ ప్రధానమైన పాత్రను పోషించారు. కొంకణాసేన్ శర్మ ఎంచుకునే పాత్రలు విభిన్నంగా .. విలక్షణంగా ఉంటాయి. నటన విషయంలోను ఆమె తనకంటూ ఒక పత్యేకమైన మార్క్ ను సొంతం చేసుకున్నారు.
ఈ కారణంగానే కొంకణా సేన్ శర్మ సినిమాలను .. సిరీస్ లను తప్పకుండా చూస్తుంటారు. అలా ఆమె చేసిన సినిమానే ఇది. సైకలాజికల్ థ్రిల్లర్ ను టచ్ చేస్తూ సాగే ఈ సినిమాను, ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గైనకాలజిస్ట్ 'గీతిక' పాత్రలో ఆమె కనిపించనుంది. తన కెరియర్ లో ఈ పాత్రకు ప్రత్యేకమైన స్థానం ఇస్తానని ఆమె చెబుతుండటం విశేషం.
కథ విషయానికి వస్తే .. గైనకాలజిస్ట్ గా గీతికకి మంచి పేరు ఉంటుంది. తన ప్రతిభకి తగిన స్థాయికి చేరుకోవడానికి ఆమెకి అవకాశాలు వస్తుంటాయి. ఈ విషయంలో ఎలాంటి పోటీని ఎదుర్కోవడానికైనా ఆమె సిద్ధమవుతుంది. అలాంటి పరిస్థితులలో ఆమెపై లైంగిక ఆరోపణలు వస్తాయి. తన కెరియర్ ను .. తన పరువు ప్రతిష్ఠలను ప్రభావితం చేసే ఆరోపణలను ఆమె ఎలా ఎదుర్కొంటుంది? అనేది కథ.