Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి ఉదారత చాటుకున్న నాగబాబు.. చిన్నారి వైద్యానికి సాయం

Nagababu Extends Financial Help to Child for Heart Treatment
Advertisement
  • జనసేన కార్యకర్త కుమారుడికి నాగబాబు ఆర్థిక సాయం
  • గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి లక్ష రూపాయల విరాళం
  • మరింత సాయం కోసం సోషల్ మీడియా ద్వారా దాతలకు పిలుపు
  • హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలుడు
Advertisement
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. తనవంతు సాయం అందించడమే కాకుండా చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామానికి చెందిన కట్టా రామకృష్ణ, జనసేన పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు శ్రీహర్ష తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్నాడు. గత 26 రోజులుగా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యుల ప్రకారం బాలుడి గుండె కేవలం 10 శాతం మాత్రమే రక్తాన్ని పంప్ చేస్తోందని తెలిసింది.

ఇప్పటికే చికిత్స కోసం ఆ కుటుంబం రూ.13 లక్షల వరకు ఖర్చు చేసింది. వైద్యానికి ఇంకా రూ.10 లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నాగబాబు వెంటనే స్పందించి, వారి కుటుంబానికి లక్ష రూపాయలు పంపించారు. అంతేకాకుండా బాలుడికి సహాయం చేయాలనుకునే వారి కోసం కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలు, క్యూఆర్ కోడ్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. నాగబాబు చేసిన సహాయానికి ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని జనసేన కార్యకర్తలు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
Advertisement
Advertisement
Nagababu
Nagababu Janasena
Heart surgery
Khammam district
Telangana
Medical assistance
Charity
Janasena party
Sriharsha
Katta Ramakrishna

More Telugu News