కర్ణాటకలో ఇంటి ఆవరణలో ఆరు కొండచిలువలు
- కార్వార్ పట్టణంలోని కతినకోన ప్రాంతంలో కనిపించిన కొండచిలువలు
- విజయ్ కాలేకర్ ఇంటి ఆవరణలో ఇనుప సామగ్రి వద్ద కనిపించిన కొండచిలువలు
- కొండచిలువలను పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన అధికారులు
ఆదివారం రోజు ఇనుప సామగ్రి వద్ద ఏదో కదులుతున్నట్లుగా గుర్తించిన విజయ్ కాలేకర్ కుటుంబసభ్యులు దగ్గరకు వెళ్లి చూడగా కొండచిలువలు కనిపించాయి. ఆరు కొండచిలువలు ఒక్కొక్కటి 8 నుంచి 12 అడుగుల పొడవు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించగా, అధికారులు వాటిని పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.