తన పేరుతో సంస్థల ఏర్పాటుపై స్పందించిన కేటీఆర్
- కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేవ పేరుతో కార్యకలాపాలు
- తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టీకరణ
- ఎవరైనా పని చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలిసి పని చేయాలని సూచన
తన పేరుతో కొంతమంది సంస్థలను ఏర్పాటు చేసినట్లు వచ్చిన వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో 'కేటీఆర్ సేవా సమితి', 'కేటీఆర్ సేన' పేరుతో కొన్ని సంస్థలు కార్యకలాపాలు చేపడుతుండటంపై ఆయన స్పందించారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని వెల్లడించారు. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు.
తన పేరుతో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదనే విషయం అందరూ గుర్తించాలని అన్నారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పరిధిలోనే చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను నిలిపివేయాలని, తనపై అభిమానం ఉన్నవాళ్లు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు.