హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు

హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కాచిగూడ, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మాసాబ్ ట్యాంకు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

కాగా, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Hyderabad
Hyderabad rains
Telangana weather
Rainfall forecast
IMD Hyderabad
Khairetabad

More Telugu News