విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందంటే..!
- ఈనెల 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి
- ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక
- ఇద్దరి మధ్య ఏడేళ్ల ఏజ్ గ్యాప్
టాలీవుడ్ ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లిపై గత కొన్నేళ్లుగా సాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. వైవాహిక బంధంతో ఇద్దరం ఒకటి కాబోతున్నట్టు వీరు అధికారికంగా ప్రకటించారు. అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమకు గౌరవంగా, తమ పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘విరోష్’ అనే పేరుతో ఈ వివాహ వేడుకను జరుపుకోబోతున్నట్లు వెల్లడించారు. ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ పేరుతో సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ అధికారిక ప్రకటన ప్రస్తుతం రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ మెగా వెడ్డింగ్‌కు రాజస్థాన్ వేదిక కానుంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఒక పురాతన చారిత్రాత్మక ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పరిమితంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ‘గీత గోవిందం’ సినిమాతో మొదలైన వీరి పరిచయం, ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సమయంలో గాఢమైన ప్రేమగా మారింది.
అయితే, ఈ పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు వీరి వ్యక్తిగత విషయాలపై ఆసక్తికరమైన చర్చను మొదలుపెట్టారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న వయసు తేడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించగా (36 ఏళ్లు), రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించారు (29 ఏళ్లు). వీరిద్దరి మధ్య దాదాపు ఏడేళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, వీరి కెమిస్ట్రీ, అన్యోన్యం ముందు ఆ తేడా ఏమాత్రం పెద్ద విషయం కాదని ఫ్యాన్స్ అంటున్నారు.