Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన లగ్జరీ లైఫ్ పై వస్తున్న అసభ్యకర కామెంట్లపై హిమజ ఫైర్

Himaja Reddy Fires Back at Critics on Luxury Lifestyle Comments
Advertisement
  • తన విలాసవంతమైన జీవితం వెనుక ఎంతో కష్టం ఉందన్న హిమజ
  • బిగ్‌బాస్ నుంచి వచ్చాక 12 మాల్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నానని వెల్లడి
  • హద్దుమీరి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
Advertisement

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వెండితెరపై రాణిస్తున్న నటి, బిగ్‌బాస్ ఫేమ్ హిమజ రెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా విమర్శకులపై నిప్పులు చెరిగారు. కష్టపడి పైకొస్తున్న ఒక తెలుగమ్మాయి సక్సెస్‌ను చూసి ఓర్వలేక, క్యారెక్టర్ మీద పడి ఏడవడం ఏంటని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. గత కొంతకాలంగా తన లగ్జరీ లైఫ్, సంపాదనపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన కామెంట్లకు హిమజ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.


తను అనుభవిస్తున్న ఈ విలాసవంతమైన జీవితం వెనుక ఎంతో కష్టం ఉందని హిమజ స్పష్టం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు సినిమాలు, సీరియల్స్‌లో శ్రమిస్తున్నానని, బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చాక దాదాపు 12 షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నానని ఆమె గుర్తు చేశారు. ఒక్కో ఓపెనింగ్‌కు వచ్చే పారితోషికమే తను వాడుతున్న కారు కొనడానికి సరిపోతుందని ఘాటుగా సమాధానమిచ్చారు. కేవలం నటన మాత్రమే కాకుండా, హెర్బాలైఫ్ సూపర్‌వైజర్‌గా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా రాణిస్తూ, సొంతంగా ఒక కంపెనీని కూడా నడుపుతున్నట్లు ఆమె వెల్లడించారు.


ముఖ్యంగా తన ఇంటి గురించి వస్తున్న ఆరోపణలపై హిమజ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇల్లు కొనడానికి తన తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా ఎంతో సాయం చేశారని, అది తెలియకుండా ఎవరో గిఫ్ట్ ఇచ్చారని కామెంట్స్ చేయడం చూస్తే వారి మనసు ముక్కలవుతుందని అన్నారు. అవసరమైతే తన ఇంటి ఈఎంఐ పేపర్లు కూడా చూపిస్తానని సవాల్ విసిరారు. ఎదుటివారి ఎదుగుదలను చూసి అసూయ పడటం మానుకోవాలని, ఒక మహిళా నటి విజయం సాధిస్తే అభినందించడం నేర్చుకోవాలని హితవు పలికారు. హద్దు మీరి ప్రవర్తిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడబోనని హిమజ హెచ్చరించారు.

Advertisement
Advertisement
Himaja Reddy
Himaja
Bigg Boss Telugu
Telugu actress
luxury lifestyle
social media trolls
film actress
serial actress
stock market investor
Herbalife supervisor

More Telugu News