Vishnu Priya: కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య
- కొడైకెనాల్‌లో నటి విష్ణుప్రియ తండ్రి, వ్యాపారి సూర్యనారాయణన్ దారుణ హత్య
- కుర్చీకి కట్టేసి, ఊపిరాడకుండా చేసి చంపిన దుండగులు
- నగదు, బంగారం, కీలక పత్రాలు చోరీ
తమిళ నటి విష్ణుప్రియ తండ్రి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సూర్యనారాయణన్ (73) తమిళనాడులోని కొడైకెనాల్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను కుర్చీకి కట్టేసి, ముక్కు, నోటికి టేపులు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో భారీగా నగదు, బంగారం, కీలక పత్రాలను దుండగులు దోచుకెళ్లారు.
పోలీసుల వివరాల ప్రకారం, దిండిగల్ జిల్లా కొడైకాన్ కురింజి ఆండవర్ ఆలయం సమీపంలో సూర్యనారాయణన్‌కు ఒక గెస్ట్ హౌస్ ఉంది. రెండు రోజుల క్రితం కోయంబత్తూర్‌కు చెందిన ఐదుగురు యువకులు పర్యాటకులమని చెప్పి అక్కడ గదులు అద్దెకు తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఇతర సిబ్బంది వెళ్లిపోయాక, గెస్ట్ హౌస్‌లో సూర్యనారాయణన్‌తో పాటు సంరక్షకులు ఆర్ముగం, మురళి మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా భావించిన నిందితులు వారిద్దరినీ తాళ్లతో కట్టేసి, సూర్యనారాయణన్‌ను హత్య చేశారు.
సంరక్షకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ హత్య వెనుక కేవలం దోపిడీ మాత్రమే కాకుండా, పాత కక్షలు కూడా కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
గతంలో నటి విష్ణుప్రియ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన డ్రైవర్ హత్య కేసులో సూర్యనారాయణన్ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసు విచారణ కోర్టులో ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార హత్య కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.