మళ్లీ ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

Sharad Pawar Hospitalized Again in Pune Due to Illness
షార్ట్స్‌లో చూడండి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్ ఆదివారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు గురికావడంతో పూణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రిలో చేరారు. తన తండ్రి దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని ఆయన కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొంది ఆయన వారం రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చారు.

శరద్ పవార్ డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
Go Back to Shorts
Sharad Pawar
NCP
Nationalist Congress Party
Supriya Sule
Ruby Hall Clinic
Pune
Dehydration
Health Update
Indian Politics

More Telugu News