Gas tanker explosion: గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడి నడిరోడ్డుపై భారీ పేలుడు.. వీడియో ఇదిగో!
- అక్కడికక్కడే నలుగురు మృతి.. మరో 17 మందికి తీవ్ర గాయాలు
- చిలీలో ఘోర ప్రమాదం.. వైరల్ గా మారిన వీడియోలు
- రహదారిపై ప్రయాణిస్తున్న 50 వాహనాలు ధ్వంసం
చిలీ రాజధాని శాంటియాగోలో గురువారం ఒక భారీ ప్రమాదం సంభవించింది. ద్రవ రూపంలో ఉన్న గ్యాస్‌ను తీసుకెళుతున్న ఒక ట్రక్కు బోల్తా పడి, నిమిషాల వ్యవధిలోనే భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రక్కు డ్రైవర్ అదుపు తప్పి వాహనాన్ని క్రాష్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో ట్రక్కు డ్రైవర్ కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. స్థానిక గ్యాస్ కంపెనీ 'గాస్కో' కు చెందిన ఈ ట్రక్కు ప్రమాదానికి గురైన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి.
భారీ పేలుడు..
పేలుడు తీవ్రతకు 150 నుంచి 200 మీటర్ల పరిధిలోని 50 వాహనాలు దెబ్బతిన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఎగిసిపడిన శకలాలు మూడు వ్యాపార సంస్థల ప్రాంగణాల్లో పడ్డాయని చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ తెలిపారు. శాంటియాగో గవర్నర్ క్లాడియో ఒరెగో సమాచారం ప్రకారం.. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. "ఒక వ్యక్తి శరీరం 100 శాతం కాలిపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు" అని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి.