భారత్ సెమీస్ చేరదు: పాక్ మాజీ బౌలర్ మొహమ్మద్ ఆమిర్
- సూపర్ 8లో భారత్ తేలిపోతుందన్న మహమ్మద్ ఆమిర్
- భారత్ సెమీస్ దాకా రావడం అసాధ్యమని వ్యాఖ్య
- సూపర్ 8లో జింబాబ్వే లాంటి డేంజర్ జట్లు ఉన్నాయన్న ఆమిర్
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు చేశాడు. గ్రూప్ దశలో భారత్ అద్భుతంగా రాణించినా... సూపర్ 8లో తేలిపోతుందని, సెమీ ఫైనల్ దాకా రావడం అసాధ్యమని హేళన చేశాడు. గ్రూప్ దశలో పాకిస్థాన్‌పై మాత్రమే భారత బ్యాటర్లు బాగా ఆడారని చెప్పాడు. యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ లాంటి చిన్ని జట్లపై ఒకరిద్దరు మాత్రమే రాణించారని అన్నాడు. పసికూన జట్లపై గెలవడాన్ని గొప్పగా భావించకూడదని చెప్పాడు.
సూపర్ 8లో జింబాబ్వే లాంటి డేంజర్ జట్లు ఉన్నాయని... భారత్ ఇక్కడే ఓడిపోతుందని ఆమిర్ అన్నాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సెమీ ఫైనల్ దాకా వస్తాయని, భారత్ మాత్రం సెమీ ఫైనల్ చేరదని చెప్పాడు.
నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు మొదలవుతున్నాయి. ఈరోజు మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ పాకిస్థాన్ మధ్య జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్ రేపు దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌తో కూడా మ్యాచ్‌లు ఉన్నాయి.