Mohammed Siraj: నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా సిరాజ్‌కు గాయం!
- సూపర్ 8 పోరుకు ముందు గాయపడ్డ కీలక బౌలర్
- హార్దిక్ పాండ్యా కొట్టిన షాట్ తో సిరాజ్ మోకాలికి తాకిన బంతి
- ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనున్న టీమిండియా
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలకమైన సూపర్ 8 పోరుకు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ శుక్రవారం సాయంత్రం నెట్స్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ జరుగుతుండగా హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి నేరుగా వెళ్లి సిరాజ్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో అతను తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫిజియోలు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, నొప్పి తగ్గకపోవడంతో సిరాజ్ నెట్స్ నుంచి వెళ్లిపోయాడు.
టోర్నీలో సిరాజ్ నాటకీయ ప్రయాణం..
ఈ మెగా టోర్నీలో సిరాజ్ ప్రయాణం మొదటి నుంచీ నాటకీయంగా సాగుతోంది. వార్మప్ మ్యాచ్ లో హర్షిత్ రాణా గాయపడటంతో చివరి నిమిషంలో సిరాజ్ జట్టులోకి వచ్చాడు. జస్ ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో తుది జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్.. ఆ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. 3 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అభిమానుల్లో ఆందోళన
సూపర్ 8 వంటి కీలక దశకు ముందు నిలకడగా రాణిస్తున్న బౌలర్ గాయపడటం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాతో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సిరాజ్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.