వైసీపీ ఎమ్మెల్సీ సవాల్ కు మంత్రి సుధారాణి కౌంటర్

Minister Sadhya Rani Responds to YSRCP MLC Challenge
షార్ట్స్‌లో చూడండి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకుని చెప్పులు, బూట్లతో ఆందోళన చేపట్టడంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్ విసిరారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లినట్లు ఒక్క ఫొటో లేదా వీడియో చూపిస్తే ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి సంధ్యారాణి వైసీపీ సభ్యులు చెప్పులతో ఉన్న వీడియోను బయటపెట్టారు.


“స్వామి వారి ఫొటోలను ప్లకార్డుల తరహాలో వాడటం దుర్మార్గం. ఒకరు తలకిందులుగా పట్టుకున్నారు, ఇంకొకరు నిరసన అవ్వగానే టేబుల్‌పై పడేశారు. వీళ్లకు దేవుడంటే భయం, భక్తి లేవు. దేనికోసం డిమాండ్ చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. వికృత చేష్టలతో స్వామివారిని అవమానించడం కలచివేస్తోంది” అని విమర్శించారు. మాధవరావు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Go Back to Shorts
Sadhya Rani
YSRCP
Andhra Pradesh
MLC Madhava Rao
Legislative Council
Venkataswara Swamy
TDP
Telugu Desam Party
Politics
Protest

More Telugu News