గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ అరెస్ట్

YSRCP Leader Nagesh Babu Arrested in Ganja Case
  • వైసీపీ ఎంపీటీసీ నగేశ్ బాబును అరెస్ట్ చేసిన జగ్గంపేట పోలీసులు
  • 220 కేజీల గంజాయిని తరలిస్తున్న కేసులో నగేశ్ బాబు నిందితుడు
  • ఈరోజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వైనం
గంజాయి కేసులో విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన వైసీపీ నేత, ఎంపీటీసీ నగేశ్ బాబును కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. పరారీలో ఉన్న ఆయనను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడికి నగేశ్ బాబు అనుచరుడనే ప్రచారం జరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్ లో 220 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పరారయ్యాడు. ఈ కేసులో ఆయన ఏ-8గా ఉన్నాడు. ఈరోజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 
Advertisement
Nagesh Babu
YSRCP
Ganja Case
Visakha District
Bhimili
Jaggampeta Police
Andhra Pradesh
Botsa Satyanarayana

More Telugu News