రెండు రోజుల వ్యవధిలోనే నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు

హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఈమెయిల్ ద్వారా కోర్టు సిబ్బందికి ఈరోజు బెదిరింపులు పంపారు. కోర్టు ప్రాంగణంలో బాంబు అమర్చామని, దానికి టైం కూడా సెట్ చేశామని, బాంబు పేలబోతోందని ఈమెయిల్ ద్వారా బెదిరించారు. 

వెంటనే కోర్టు సిబ్బంది పోలీసులు, క్విక్ రెస్సాన్స్ టీమ్, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా నిమిషాల వ్యవధిలోనే వారు కోర్టు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు.

ఈనెల 18వ తేదీ కూడా నాంపల్లి కోర్టుకు బంబు బెదిరింపులు వచ్చాయి. అదే రోజున కరీంనగర్, అనంతపురం, రాజమండ్రి కోర్టులకు కూడా బెదిరింపులు రావడం గమనార్హం. అయితే, ఆయా కోర్టుల్లో నిర్వహించిన తనిఖీల్లో బాంబుల ఆచూకీ లభించలేదు. ఇవన్నీ నకిలీ బెదిరింపులుగా పోలీసులు నిర్ధారించారు.

Nampally Court
Hyderabad
CBI Court
Bomb threat
Karimnagar
Anantapur
Rajahmundry
Telangana Police
Court security

More Telugu News