కాలేజీలు, స్కూళ్లకు ఏఐని అందుబాటులోకి తీసుకొస్తాం: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

  • ఏఐ పటంలో భారత్ ను నాయకుడిగా నిటబెట్టడమే లక్ష్యమన్న అశ్విని వైష్ణవ్
  • విద్యార్థులకు ఏఐ నాలెడ్జ్ ను తీసుకొస్తామని వెల్లడి
  • పాఠశాలలు, కళాశాలలకు ఏఐ సాధనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ భారత్ భవిష్యత్ ఏఐ ప్లాన్‌ను స్పష్టంగా వివరించారు. దేశాన్ని ప్రపంచ ఏఐ పటంలో నాయకుడిగా నిలబెట్టడమే లక్ష్యంగా పాఠశాల, కాలేజీ స్థాయి సిలబస్‌ను పూర్తిగా మారుస్తున్నామని ప్రకటించారు.


విద్యార్థులకు ఏఐ నాలెడ్జ్ ను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. పాఠశాలలు, కళాశాలలకు ఏఐ సాధనాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. విద్యార్థులు కేవలం సాంకేతికతను నేర్చుకోవడమే కాకుండా, సమస్యలకు కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. 


“దేశంలో ప్రతిభకు కొరత లేదు. యువత భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే... భారత్ ప్రపంచ ఏఐ  పటంలో అగ్రస్థానంలో నిలుస్తుంది” అని అన్నారు. సెమీకండక్టర్, టెలికాం రంగాల్లో సాధించిన విజయాల తరహాలోనే ఏఐ మిషన్‌ను వేగవంతం చేస్తామని మంత్రి అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ వంటి సంస్థలు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయని ప్రశంసించారు.



More Telugu News