Telangana Education Department: తెలంగాణలో పరీక్షల మధ్యలోనూ స్పెషల్ క్లాసులు.. టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్!

Telangana Education Department Plans Special Classes During SSC Exams
  • పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం 'సపోర్టివ్ ప్లాన్'
  • ప్రీ-ఫైనల్ మార్కుల ఆధారంగా విద్యార్థుల వర్గీకరణ
  • పరీక్షల మధ్య వచ్చే సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు
  • విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ విద్యాశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్‌సీ బోర్డు పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా 'సపోర్టివ్ ప్లాన్' అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం, విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని మూడు గ్రూపులుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రీ-ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను వర్గీకరిస్తారు. కనీస మార్కులు సాధించడంలో ఇబ్బంది పడుతున్న వారిని 'స్ట్రగ్లర్స్' (కేటగిరీ-1) గా, సగటు మార్కులు తెచ్చుకుంటున్న వారిని 'యావరేజ్' (కేటగిరీ-2) గా, అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారిని 'అడ్వాన్స్‌డ్' (కేటగిరీ-3) గా విభజిస్తారు. ప్రతి కేటగిరీ విద్యార్థులకు వారి స్థాయికి అనుగుణంగా బోధన ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులు సులువుగా పాస్ అయ్యేలా, ప్రతిభావంతులు 10/10 జీపీఏ సాధించేలా ప్రోత్సహిస్తారు.

ఈ ఏడాది పరీక్షల మధ్య 3 నుంచి 4 రోజుల సెలవులు ఉన్న నేపథ్యంలో, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ క్లాసుల్లో కీలకమైన అంశాలను వివరించడంతో పాటు, విద్యార్థులు జవాబులు రాసే విధానాన్ని మెరుగుపరచడంపై ఉపాధ్యాయులు దృష్టి పెడతారు.

అయితే, విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షల సమయంలో విద్యార్థులను మళ్లీ పాఠశాలలకు పిలవడం వారిపై అదనపు ఒత్తిడి పెంచుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ విధానం వల్ల విద్యార్థులు స్వేచ్ఛగా ప్రిపేర్ అయ్యే అవకాశం కోల్పోతారని, హాజరుశాతం కూడా తక్కువగా ఉండొచ్చని వారు వాదిస్తున్నారు. 
Telangana Education Department
SSC exams
10th class
special classes
board exams
exam preparation
student support
academic performance
pre final exams
teachers unions

More Telugu News