Talashila Raghuram: తలశిల రఘురామ్‌ని పరామర్శించిన వైఎస్ జగన్
- తలశిల రఘురామ్ తండ్రి కన్నుమూత
- గొల్లపూడిలోని రఘురామ్ నివాసానికి వెళ్లిన జగన్
- చంద్రశేఖరరావు భౌతికకాయానికి నివాళి అర్పించిన వైసీపీ అధినేత
వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ను ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ ఉదయం తలశిల రఘురామ్ తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో విజయవాడ గొల్లపూడిలోని రఘురామ్ నివాసానికి జగన్ వెళ్లారు. చంద్రశేఖరరావు భౌతికకాయానికి ఆయన నివాళి అర్పించారు. అనంతరం రఘురామ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు జోగి రమేశ్, దేవినేని అవినాశ్, విడదల రజని, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.