Manchu Lakshmi: నా జీవితంలో ఆ అధ్యాయం ముగిసిపోయింది: మంచు లక్ష్మి

Manchu Lakshmi reveals financial struggles from film production
  • ఐదేళ్ల క్రితం నిర్మించిన ఒక సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చిందన్న మంచు లక్ష్మి
  • ఇప్పటికీ అప్పులు కట్టుకుంటున్నానని వెల్లడి
  • నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మి సినీ నిర్మాణ రంగంలో కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 


తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక బాధాకరమైన విషయాన్ని పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం తాను నిర్మించిన ఒక సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చిందని ఆమె తెలిపారు. ఆ నష్టాలు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని చెప్పారు. ఆ సినిమా కోసం చేసిన అప్పులను ఇప్పటికీ కట్టుకుంటున్నానని తెలిపారు. అందుకే నిర్మాతగా తన జీవితంలో ఆ అధ్యాయం ముగిసిపోయిందని చెప్పారు. ఇకపై నటనపైనే పూర్తి దృష్టి పెడతానని తెలిపారు.


నిర్మాత సాధకబాధకాలు తనకు తెలుసని... అందుకే, ఎవరైనా స్క్రిప్ట్ పట్టుకొని వస్తే ముందుగా ‘నిర్మాత ఎవరు?’ అని అడుగుతున్నానని... నిర్మాత ఉన్నప్పుడే మాట్లాడమని చెబుతున్నానని మంచు లక్ష్మి చెప్పారు.  

Manchu Lakshmi
Manchu Lakshmi producer
Telugu cinema
Tollywood
Film production loss
Movie industry
Web series
Actress
Interview

More Telugu News