Palnadu: కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డుపై వేటు
- కోటప్ప కొండ తిరునాళ్లలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేసిన హోంగార్డు కోటేశ్వరరావు
- సోషల్ మీడియాలో వీడియోల వైరల్
- సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన పల్నాడు ఎస్పీ
తిరునాళ్లలో డ్యూటీ వేస్తే విధులు నిర్వహించకుండా ఏకంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయించిన హోంగార్డుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కోటేశ్వరరావుకు కోటప్పకొండ తిరునాళ్లలో ఉన్నతాధికారులు డ్యూటీ వేశారు. అయితే, అక్రమ సంపాదనకు అలవాటు పడిన అతను తిరునాళ్లలో ఏకంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు సాగించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సీరియస్ అయ్యారు. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.