సీఎం చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు
- అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
- నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు తోడ్పాటు అందించాలని వినతి
- కనిగిరి రిజర్వాయర్, ముదివర్తి కాజ్ వే, ఉప్పటేరు వంతెన నిర్మాణాల గురించి వినతి
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిన్న కలిసిన వీరు కోవూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను విన్నవించి, వాటి పరిష్కారానికి సహకారం అందించాలని కోరారు.
ప్రధానంగా కనిగిరి రిజర్వాయర్ పనులను త్వరిగతిన చేపట్టాలని సీఎంను వారు కోరారు. అలానే ముదివర్తి – ముదివర్తిపాలెం వరకు కాజ్ వే నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. గంగవట్నం, పల్లిపాలెం గ్రామంలో ఉప్పటేరు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. బుచ్చిరెడ్డిపాలెం ఫైర్ స్టేషన్ కు కావాల్సిన అదనపు సిబ్బందిని నియమించాలని సీఎంకు విన్నవించారు.