Nepal Cricket: వరల్డ్ కప్ ప్రస్థానాన్ని గెలుపుతో ముగించిన నేపాల్... స్కాట్లాండ్‌పై సూపర్ చేజింగ్

Nepal wins against Scotland T20 World Cup
షార్ట్స్‌లో చూడండి
టీ20 వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో నిరాశపర్చిన నేపాల్, తమ ప్రస్థానాన్ని గెలుపుతో ముగించింది. గ్రూప్-సిలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 171 పరుగుల భారీ లక్ష్యాన్ని నేపాల్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిన నేపాల్‌కు ఇది తొలి విజయం కావడం విశేషం.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నేపాల్‌కు స్కాట్లాండ్ బ్యాటర్లు సవాలు విసిరారు. ఓపెనర్ మైఖేల్ జోన్స్ (45 బంతుల్లో 71) అద్భుత అర్ధశతకంతో చెలరేగడంతో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామి 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.ః

లక్ష్య ఛేదనలో నేపాల్‌కు ఓపెనర్లు కుశల్ భుర్టెల్ (43), ఆసిఫ్ షేక్ (33) శుభారంభం అందించారు. అయితే, స్కాట్లాండ్ బౌలర్ మైఖేల్ లీస్క్ వీరిద్దరితో పాటు కెప్టెన్ రోహిత్ పాడెల్ (16)ను కూడా ఔట్ చేయడంతో నేపాల్ 98 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్షన్ ఝా (24*) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఐరీ కేవలం 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు అబేధ్యంగా 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో నేపాల్ చారిత్రక విజయాన్ని అందుకుంది. 

Go Back to Shorts
Nepal Cricket
Nepal
Scotland
T20 World Cup
Kushal Bhurtel
Dipendra Singh Airee
Sompal Kami
Michael Jones
Gulshan Jha
Cricket

More Telugu News