IAS Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి భారీ షాక్ ఇచ్చిన సుప్రీం
- ఓఎంసీ కేసులో విచారణకు గ్రీన్ సిగ్నల్!
- డిశ్చార్జ్ పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టు
- పొరపాటును సవరిస్తున్నామంటూ కోర్టు వ్యాఖ్య
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
సీబీఐ కీలక వాదనలు
ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టులో బలమైన వాదనలు వినిపించింది. మైనింగ్ నిబంధనల్లోని 'క్యాప్టివ్ మైనింగ్' అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించి, అక్రమాలకు దారులు తెరిచారని సీబీఐ ఆరోపించింది. ఈ అక్రమ వ్యవహారంలో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారని, ఆ సమయంలోనే ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
పొరపాటును సవరిస్తున్నాం..
ఈ కేసును విచారించిన జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గతంలో ఈ కేసును వేరే కేసుగా భావించి పొరపాటున స్టే ఇచ్చాము. ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నాము. నిందితులు ఆ స్టేను ఇప్పటివరకు ఎంజాయ్ చేశారు’’ అని ధర్మాసనం పేర్కొంది. దీంతో, శ్రీలక్ష్మి ఇప్పుడు తప్పనిసరిగా కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.