క్రికెట్ కోసం 'పదో తరగతి' పరీక్షలకు దూరం: వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం

  • ప్రస్తుతం వైభవ్ దృష్టంతా క్రికెట్‌పైనే ఉందన్న తండ్రి సంజీవ్ సూర్యవంశీ
  • ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరు కావడం లేదని వెల్లడి
  • వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడన్న సంజీవ్  
భారత అండర్‌-19 ప్రపంచకప్‌లో స్టార్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు. క్రికెట్ శిక్షణతో పాటు రాబోయే కీలక టోర్నీలపై పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వైభవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైభవ్ పరీక్షలకు హాజరుకాకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పాఠశాల యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. 

ఈ విషయంపై వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ.. ప్రస్తుతం వైభవ్ దృష్టంతా క్రికెట్‌పైనే ఉందని, అందుకే ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు అతను హాజరు కావడం లేదన్నారు. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడని తెలిపారు. తండ్రితో చర్చించిన తర్వాతే పరీక్షలకు దూరంగా ఉండాలని వైభవ్ నిర్ణయించుకున్నాడని తాజ్‌పూర్‌లోని మోడెస్టరీ స్కూల్ డైరెక్టర్ ఎ.కె. పింటూ వెల్లడించారు.


More Telugu News