Jasprit Bumrah: మా ప్లాన్ సరిగ్గా అమలు చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి: బుమ్రా

Jasprit Bumrah Says Plans Well Executed Led to Success Against Pakistan
  • ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి పాక్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా
  • మ్యాచ్ అనంతరం తన భార్య, ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌తో సరదాగా ముచ్చటించిన బుమ్రా 
  • యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆడిన తీరు ప్రశంసనీయమన్న బుమ్రా
పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి పాక్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం తన భార్య, ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌తో సరదాగా ముచ్చటించిన బుమ్రా, జట్టు విజయం, ప్రణాళికల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

చాలా కాలం తర్వాత మళ్లీ కొత్త బంతితో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడంపై బుమ్రా స్పందిస్తూ.. జట్టు అవసరమే నాకు ముఖ్యం. ఎప్పుడు బౌలింగ్ చేయమన్నా నేను సిద్ధం. పాక్‌పై కొత్త బంతితో స్వింగ్ లభించింది, దానిని చక్కగా వినియోగించుకున్నాను. మా ప్లాన్ సరిగ్గా అమలు చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి అనడానికి ఈ మ్యాచ్‌ ఒక ఉదాహరణ అని పేర్కొన్నాడు. వాతావరణం కూడా బౌలర్లకు అనుకూలించడం కలిసొచ్చిందని అన్నారు.  

యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆడిన తీరును బుమ్రా కొనియాడాడు. కొలంబో పిచ్‌పై పరుగులు రాబట్టడం అంత సులభం కాదు. కానీ ఇషాన్ చాలా తెలివిగా ఆడాడు. ఏ సమయంలో ఎలాంటి షాట్లు ఆడాలో అతడికి పూర్తి అవగాహన ఉంది. రిస్క్ తీసుకుంటూనే జట్టును ఆదుకున్న తీరు అద్భుతం అని ప్రశంసించాడు. మ్యాచ్‌కు ముందు డగౌట్‌లో రోహిత్ శర్మతో జరిగిన సంభాషణ గురించి అడగ్గా బుమ్రా నవ్వుతూ.. "రోహిత్ భాయ్‌తో క్రికెట్ గురించి అసలు చర్చించలేదు. అక్కడ ఉన్న ఒక సింగర్ గురించి, హనుమాన్‌కిండ్ ర్యాప్ సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం. రోహిత్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు" అని పేర్కొన్నాడు. 

చివరగా, ఇషాన్ కిషన్, ర్యాపర్ హనుమాన్‌కిండ్ మధ్య ఉన్న పోలికల గురించి సంజన అడిగిన ప్రశ్నకు బుమ్రా స్పందిస్తూ.. అవును, వారిద్దరి మధ్య పోలికలు ఉన్నాయి. ఇషాన్ కూడా ఆ హెయిర్‌స్టైల్ ట్రై చేస్తే చూడాలని ఉంది, కానీ హెల్మెట్ పెట్టుకోవడం కష్టమేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
Jasprit Bumrah
Bumrah
India vs Pakistan
Ishan Kishan
Sanjana Ganesan
Rohit Sharma
Hanumankind
Cricket
Asia Cup 2023
Bowling

More Telugu News