Kiren Rijiju: చైనా సరిహద్దు ప్రాంతంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పర్యటన

ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం వివాదం వేళ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చైనా సరిహద్దుల్లో పర్యటించారు. ప్రచురితం కాని నరవణే పుస్తకాన్ని ప్రదర్శిస్తూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో చైనా సరిహద్దుకు దగ్గరలోని తన నియోజకవర్గం అరుణాచల్ వెస్ట్‌లో కేంద్రమంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ, పార్లమెంటు సజావుగా సాగడంపై రాహుల్ గాంధీకి ఆసక్తి లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని కొన్ని ఎన్జీవోలు ఆయనకు చెప్పాయని, అందుకే పదేపదే సభను అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశ భద్రత విషయంలో రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.

ప్రచురితం కాని పుస్తకం గురించి చెప్పడానికి ఏముంటుందని కిరణ్ రిజిజు అన్నారు. ఆ పుస్తకం గురించి మనం మాట్లాడుకోకూడదని అన్నారు. అయితే రాహుల్ గాంధీ మాట్లాడింది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి తీవ్రంగా పరిగణించాలని అన్నారు. అలాంటి అంశాలను రాజకీయాల కోసం ఉపయోగించుకోవద్దని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి సరిహద్దుల గురించి ఏమీ తెలియదని, అందుకే అలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సరిహద్దుల గురించి ఆయన తెలుసుకుంటే మంచిదని సూచించారు.
Kiren Rijiju
China border
Arunachal Pradesh
Rahul Gandhi
Indian Army
General Naravane book controversy

More Telugu News