Nitish Kumar: మహిళలకు మరోసారి భారీ కానుక ఇచ్చిన నితీశ్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహిళలకు శివరాత్రి కానుకను అందించారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున నేరుగా జమ చేశారు. తమ ఖాతాల్లో డబ్బు జమ కావడంతో మహిళలు ఖుషీగా ఉన్నారు.


గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాగే మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. ఆ డబ్బు ప్రభావంతో మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేసి బీజేపీ-జేడీయూ కూటమికి భారీ మద్దతు తెలిపారు. ఫలితంగా ఎన్డీయే కూటమి 202 స్థానాలు కైవసం చేసుంది. నితీశ్ మరోసారి సీఎం అయ్యారు.


ఇప్పుడు శివరాత్రి పండుగ సమయంలో మళ్లీ ఖాతాల్లో రూ.10 వేలు జమ కావడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళల సంక్షేమం విషయంలో నితీశ్ ఎప్పుడూ ముందుంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Nitish Kumar
Bihar
Bihar government
Women empowerment
Financial assistance
Assembly elections
Shivaratri
JDU
BJP

More Telugu News