Nara Lokesh: కొలంబోలో ఇవాళ మామూలుగా లేదు... భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన నారా లోకేశ్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడారు. కొలంబో స్టేడియంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన అనంతరం, సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

"టీమిండియాకు ఇది గొప్ప రాత్రి. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఆటలో భయం లేదు, ఎంతో ధారాళంగా, అద్భుతంగా ఆడి ఆకట్టుకున్నాడు" అని లోకేశ్ ప్రశంసించారు. అనంతరం భారత బౌలర్ల ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. "మన బౌలర్లు సమష్టిగా రాణించి, పూర్తి ఆధిపత్యంతో జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించారు. భారత జట్టును చూసి గర్వంగా ఉంది" అని తన పోస్టులో పేర్కొన్నారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా లోకేశ్ స్పందిస్తూ, ఈ కీలక పోరు కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని, టీమిండియాకు మద్దతుగా నిలుస్తున్నానని తెలిపారు. భారత జట్టు దేశం గర్వపడేలా చేయాలని ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్షించినట్టే టీమిండియా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.
Nara Lokesh
India vs Pakistan
T20 World Cup
Colombo
Ishan Kishan
Cricket
AP Minister
India Cricket Team
Cricket Match
T20

More Telugu News