Bihar Dancer: మితిమీరిన అభిమానం... ఆసుపత్రిపాలైన డ్యాన్సర్!

Bihar Dancer Assaulted During Performance Hospitalized
షార్ట్స్‌లో చూడండి
బీహార్‌లో జరిగిన ఓ దారుణ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. స్థానిక సాంస్కృతిక కార్యక్రమంలో నృత్యం చేస్తున్న మహిళపై కొందరు దుండగులు అమానుషంగా ప్రవర్తించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన భోజ్‌పూర్ జిల్లాలోని చంద్వా తోలా ప్రాంతంలో జరిగింది. 

వేలాదిమంది హాజరైన కార్యక్రమంలో వేదికపై నృత్య ప్రదర్శన కొనసాగుతుండగా, కొందరు ఆకతాయిలు నర్తకితో అసభ్యంగా ప్రవర్తించారు. మొదట నాణేలు విసిరిన వారు, అనంతరం వేదికపైకి ఎక్కి బలవంతంగా ఆమె నోటిలో నాణేలు పెట్టి మింగించారు. దీంతో ఆమెకు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని అత్యవసరంగా అరా సదార్ హాస్పటల్‌కు తరలించారు. వైద్యులు ఆమె గొంతులో ఇరుక్కున్న నాణేలను తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, తదుపరి 24 గంటలు కీలకమని వైద్యులు వెల్లడించారు. 

బాధితురాలి భర్త రాజు కుమార్ మాట్లాడుతూ, తన భార్య వేదికపై నృత్యం చేస్తుండగా కొందరు ప్రేక్షకులు పైకి ఎక్కి బలవంతంగా నోటిలో నాణేలు పెట్టారని ఆరోపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమ నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు పోలీసులు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Bihar Dancer
Bihar cultural event
Dancer assaulted
Bhojpur district
Ara Sadar Hospital
Dance performance
Crime news Bihar
Raju Kumar
Chandwa Tola

More Telugu News