Suryakumar Yadav: పాక్ మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్ శైలిని అనుకరించిన సూర్య... వీడియో ఇదిగో!

Suryakumar Yadav imitates Pakistani mystery spinner bowling style
షార్ట్స్‌లో చూడండి
భారత్ - పాకిస్థాన్ మధ్య నేడు ఉత్కంఠభరిత పోరు జరగనుంది. కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు ఇప్పటికే చేరుకుని ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాయి. అభిమానుల్లో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. 

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెట్స్‌లో బౌలర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ విభిన్న యాక్షన్ బౌలర్ ‘తారిక్’ శైలిని అనుకరిస్తూ బంతులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన చేసిన ఆ ఇమిటేషన్ చూసి సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ నవ్వులు పూయించారు. 

ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఆ క్లిప్‌ను పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. 
Go Back to Shorts
Suryakumar Yadav
India vs Pakistan
Asia Cup 2023
Cricket
Tariq Pakistani bowler
Mystery spinner
Colombo
Cricket practice
Indian Cricket Team

More Telugu News