బంగ్లాదేశ్ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: తారిఖ్ రెహ్మాన్

బంగ్లాదేశ్ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: తారిఖ్ రెహ్మాన్

Tarique Rahman Prioritizes Bangladesh Interests First
  • విజయం అనంతరం తొలి ప్రసంగం చేసిన తారిఖ్ రెహ్మాన్
  • బంగ్లాదేశ్ ప్రజలకే ఈ విజయం చెందుతుందన్న బీఎన్‌పీ అధినేత
  • హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకుందామన్న తారిఖ్ రెహ్మాన్
బంగ్లాదేశ్ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తొలి ప్రసంగం చేశారు. తమ విజయం బంగ్లాదేశ్ ప్రజలకే చెందుతుందని అన్నారు. ఇప్పుడు మనమంతా స్వేచ్ఛను పొందామని, హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నామని ఆయన పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరికీ ఈ విజయన్ని అంకితమిస్తున్నామని అన్నారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే దేశ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని అన్నారు.

కాగా, భారత్, చైనా వంటి దేశాలతో సంబంధాలలో సమతుల్యత పాటిస్తామని తారిఖ్ రెహ్మాన్ గతంలో అన్నారు. రెండు దేశాల నిర్ణయాలు, ప్రయోజనాలపై ఆధారపడి భారత్‌తో తమ సంబంధాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Tarique Rahman
Bangladesh Nationalist Party
Bangladesh Elections
Bangladesh Foreign Policy

More Telugu News